రెప్పలను
దాటని స్వప్నాలు
హృద్యమై వెలిగింది ఓ భావం నాలో
మకరందమై కురిసింది ఓ
గీతం నాలో
మల్లికలా విరిసింది ఓ
జ్ఞాపకం నాలో
మిణుగురు పురుగులా
మెరిసింది ఓ స్వప్నం నాలో
హృద్యమై వెలిగిన
భావాన్ని
దీపంలా మలుచుకుని
మకరందాల వానలో
తనువుని తడుపుకుని
జ్ఞాపకాల మల్లికలను
మధుర స్వప్నాలుగా
చేసుకుని
మిణుగురు పురుగులను
నక్షత్రాలుగా దాచుకుని
మనసు పుస్తకంలో
అక్షరాలుగా
రాసుకుందామని
అనుకున్నా
ఎందుకో ఏమో
భావాలన్నీ కనురెప్పల
స్వప్నాలుగానే
మిగిలిపోతున్నాయి
విడివడిన భావాలు అక్షర
విహీనమై
మనసునే
వెక్కిరిస్తున్నాయి
మనస్వినీ
No comments:
Post a Comment