చిన్ని ఆశ
అవధులు
దాటిన ఆలోచనల
విచ్చుకత్తులకు
గుండెను పరిచిన
సేనానిని
నేను
ఎండమావులు
సైతం కానరాని ఎడారిలో
నడక
నేర్చిన బాటసారిని నేను
మిలమిల తారకలను
మల్లికలుగా మలిచి
పిచ్చి
రాతలు రాసుకునే
భావకుడిని
నేను
సునామీలను
ఎదురీది
తీరంలో
మునకలు వేసే
నావను
నేను
పెదాలు
దాటని మాటలను ఇటుకలుగా పేర్చి
మౌనమనే
కోటను కట్టి
నిశబ్ద
రాజ్యాన్ని నిర్మించిన
నిశీధి
నియంతను నేను
అల్లకల్లోల
అంతరంగపురానికి
వైభవమై
నిలిచిన
రారాజునే
నేను
గుడ్డి దీపం వెలుతురులో నిశిని గెలవాలని
ఆరాటపడే
చిన్ని ఆశనే నేను
మనస్వినీ
No comments:
Post a Comment