దేవుడా జాగ్రత్త
నీ గుడిలో విధ్వంసం
నీ మసీదులో విలయతాడవం
పచ్చని సీమల్లో
రక్తతర్పణం
నాగరికత నేర్పిన
వీధులు భస్మీపటలం
ఆచారవ్యవహారాలపై
అంకుశం
తినే తిండిపై నిషేధం
విశ్వాసులం మేమేనని
ఉగ్రరూపం
ఘర్ వాపసీ అంటూ మరో
కపటం
చాపకింద నీరులా
తెల్లదొరల నాటకం
జనావాసాలలో
ఉసురుపోసుకుంటున్న సమరం
నీ పేరు మీదే ఈ పోరాటం
నీ ఉనికే ప్రశ్నలా
మిగిలిన వైనం
తారా స్థాయికి చేరింది
మారణహోమం
శక్తులుడిగిన నీవు
చేసేది శూన్యం
నీ పేరుమీద జరుగుతోందీ
రక్తతర్పణం
పారిపో ఎక్కడికైనా
తలదాచుకో ఎక్కడైనా
దేవుడా
ఈ మనిషి నిన్ను కూడా
చంపేస్తాడేమో
No comments:
Post a Comment