ఎవరక్కడా
మహమ్మద్ రఫీ అమృత
గానం
కిషోర్ దా మధుర గాత్రం
పంకజ్ ఉధాస్ గళం నుండి జాలువారే గజల్స్
జగ్జీత్ సింగ్ జాదూగరీ స్వరం
ఓ బంగరు రంగుల చిలకా అంటూ కవ్వింపులు
కురిసింది వానా నాగుండెలోనా అంటూ సరాగాలూ
ఇలాంటి మధుర గీతాలు నాకెంతో ఇష్టం
ఏమాత్రం వీలుచిక్కినా
మధురగీతాల సవ్వడిలో జారిపోతాను
ఆ భావాల జడిలో తడిసిపోతాను
ఆ సాయంత్రం కూడా అవే గీతాలు
అవేరాగాలు
గొంతు శృతి చేసిన మనస్విని స్వరాలు
అదో అద్భుతమైన ఆనందం
అంతలోనే దూకారు చిచ్చర పిడుగులు
మీకో మంచి పాట వినిపిస్తామంటూ
మ్యూజిక్ సిస్టం వారి స్వాధీనమయ్యింది
చెవులు పగిలే డ్రమ్స్ మోత
రహమాన్ కొత్తగా పాడాడంట
సరే అది ఐపోయిందా మరో పాట
అదేదో కిలికి భాష అంట
కాకా క్కికి కుక్కూ కేకీ అంటూ
ఒకే అక్షరంతో చిత్రవిచిత్ర విన్యాసాలు
కిలికి బాంబు మెదడును భస్మీపటలం చేసింది
ఆ మోత ఆగేలా లేదు
పిల్లలు ఊపుమీదున్నారు
తల్లి కోడి సపోర్ట్ పిల్లలకే
చెవులు గట్టిగా మూసుకున్నా
గట్టిగా అరిచా
ఎవరక్కడా
నా అశ్వము సిద్ధము చేయుడి
సైనికులారా అస్త్ర శస్త్రములు సిద్ధం చేయుడి
సమరానికి పోవలె..
No comments:
Post a Comment