చిలిపి సరాగాలు
ఎంత
అందంగా ఉంటాయి నీ మాటలు
ఎంత
మధురంగా ఉంటాయి నీ చేతలు
ఒకసారి
కన్నుగీటి కవ్విస్తావు
మరోసారి
బుంగ మూతితో పలకరిస్తావు
బుగ్గలనిండా
గాలి నింపుకుని
రెండు
చేతులతో కొట్టుకుంటావు
ఒక
చేతితో కన్నుమూసుకుని
మరో
కన్ను తెరిచి
కన్ను
గీటినట్లు పోజుకొడతావు
కన్ను
గీటడం తెలియక కాదు
బుంగమూతి
పెట్టడం రాకా కాదు
కావాలనే
చేస్తావు
మనసు
నిండా కవ్విస్తావు
చిలిపి
పనులతో ఉడికించే యత్నం చేస్తావు
ఎంత
బాగా మారుస్తావు మనసుని
ఎంత
అద్భుతంగా పక్కదారి పట్టిస్తావు ఆలోచనలని
ఎంత
బావుంటుంది ఆ క్షణం
ఎడారిలో
ఒయాసిస్సు దొరికినట్లు
ఎండమావుల్లోనూ
దప్పిక తీరినట్లు
వాడిన
మానులో కొత్త చివురు తొడిగినట్లు
బీటలు
వారిన పుడమిలో అంకురం మొలిచినట్లు
ముభావమైన
మనసులో
సరికొత్త
భావాల తొలకరి కురిసినట్లు
కదలిక
కోల్పోయిన మదిలో
ఏవో
కదలికలు కదిలినట్లు
నిజమే
నీ
చిలిపి సరాగాలు
నాకు
ప్రాణవాయువులు
మనస్వినీ
No comments:
Post a Comment