Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 11 March 2015

మనసు పుస్తకం



మనసు పుస్తకం

అవును నేనింతే
నేనిలాగే ఆలోచిస్తాను...
నా భావాలు
నా ఆలోచనలు ఇంతే...
ఒక్కో ఆలోచనను
పదును పెట్టుకుంటున్నా ...
ఒక్కో భావాన్ని
మెరుగుపర్చుకుంటున్నా...
ఒక్కో అడుగూ
అలోచించే వేస్తున్నా ...
అవి తడబడే అడుగులే అయినా
నీ జాడల వైపే కదులుతున్నాయి...
నా అడుగులను ఆపకు
నీ దారి మరలనీయకు...
బాధ్యతల సమరాన్ని అధిగమించి
పరిమళాల మనసును చేరుకుంటున్నా...
మనసైన మనసును అగనీయకు
మనసును మనసులో కలిసిపోనివ్వు..
అక్షరాల సయ్యాటను ఆగనీయకు
భావనల పూదోటను చిగురించనివ్వు...
ఆకాశం నా మనసు పుస్తకమైతే
మెరిసే చుక్కలే నా అక్షరాలు...
నీలి నింగిలో
మెరిసే చుక్కల్లో
విరిసే భావంలో
ఎప్పుడూ ఉండేది
నిత్యం కనిపించేది
నువ్వుగాక ఇంకెవ్వరు
నేస్తమా...

No comments:

Post a Comment