Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 29 March 2015

రక్షకుడినే నేను



 రక్షకుడినే నేను


వికసించే పుష్పం నీవయితే
మనసును దోచే పరిమళం నేనేవుతా...
పుష్పరాజం గులాబీ నీవయితే
నీ తావిలో ముల్లును నేనవుతా...
నిన్ను విసిగించే  సమాజానికి
వాడి ముల్లునై గుచ్చుకుంటా...
వెలిగే దీపం నీవైతే
అరచేతినై గాలిని ఆపేస్తా...
విరజిమ్మే నీ వెలుగులకు
నా ఊపిరినే ఇంధనం చేస్తా...
చందమామావు నీవైతే
సూరీడునై నీకు వెన్నెలనిస్తా...
కడలివే నీవైతే
నీపై కెరటమై నర్తిస్తా...
కదిలే మేఘం నీవే అయితే
గర్జించే ఉరుమునే నేనవుతా...
తొలకరి చినుకువు నీవైతే
పరిమళించే మట్టివాసన నేనవుతా...
పుడమిలో మట్టినై
గాలిలో ధూళినై
అడుగులకు జాడనై
నీ దిశగా వచ్చే శరములకు
ఎదురు నిలిచే డాలునై
నీ కరమున కరవాలమునై
నిన్నంటే ఉంటా
నీ వెంటే ఉంటా
నా శ్వాస నిష్వాసలే
నీకు రక్షణ కవచాలు
మనస్వినీ...

1 comment:

  1. నా దిశ దశ ...నా ఉచ్వాస నిశ్వాసల్లో..నా హృదయ స్పందనల్లో నా చీకటి వెలుగుల జీవన సమీరంలో ఒక వేగు చుక్కవై నువ్వు ఉన్నవనే నా దైర్యం...నువ్వే లేని నేను శూన్యం...లవ్ యు శ్రీవారు( వాణి శ్రీవిద్య )

    ReplyDelete