Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 24 March 2015

మన్నించు మనస్వినీ

మన్నించు మనస్వినీ


ఆలోచన అంతమయ్యింది
ఆవేశం రగిలింది...
విచక్షణ కరిగిపోయింది
మాటలు ఈటెలయ్యాయి...
పలుకులు గునపాలుగా
చేతలు శూలాలుగా
పరిణమించాయి...
ఓ గుండెకు గాయమయ్యింది
ఓ మనసు చెదిరిపోయింది...
సమాజం తూట్లు పొడుస్తున్నా
బండరాయిగా మారిన
మనసుకు
మనసైన మనసే గాయం చేసింది...
ఆవేశం నశించి
ఆలోచన చిగురు తొడిగింది...
చేసిన పాపం వెక్కిరించింది...
మాటల తూటాలు నవ్వుతున్నాయి...
అర్థమే లేని వాదనలు
కన్నీరు పెడుతున్నాయి...
మసున మనసును
ఛిద్రం చేసిన మనసు
సిగ్గుతో తలవంచుతోంది...
మనసుపై మనసులో
కొంతైనా మనసుంటే
మన్నించు మనస్వినీ...

No comments:

Post a Comment