Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 19 March 2015

నేనింతే

నేనింతే

అవును నేను స్వార్ధ పరుడినే
నా నరనరానా స్వార్ధమే
అణువణువులో స్వార్ధమే...
నా ఆలోచనలో
నా ఊహల్లో
నా భావంలో
నా రాతల్లో
నా పిచ్చి అక్షరాల్లో
కనిపించేదంతా స్వార్ధమే...
నాది నాదే అని అనుకుంటే
నాది నాకే అనుకుంటే
అది స్వార్ధమే...
నీకేం తెలుసు నా స్వార్ధం
నువ్వు చేరుకోగలవా
నా స్వార్ధం అంచుల్లోకి...
తొంగి చూడగలవా
నా గుండె లోతుల్లోకి...
గుండెలోని
ప్రతి కణం స్వార్ధమనే రుధిరంలో
తడిసి ముద్దయ్యింది...
స్వార్ధంలో పునీతమైన
కణం కణం
నిన్నే కోరుకుంటుంది...
నీ హాస్యం
నీ భాష్యం
నీ లాస్యం నాదేనంటుంది...
ఎక్కడో నువ్వుంటే
తట్టుకోలేనని మొరాయిస్తోంది...
చంద్రుని చుట్టూ చకోరంలా
నీ చుట్టే తిరగాలని
ఆరాటపడుతోంది...
నీకేం తెలుసు
నీవు లేని క్షణం
అది మరణశాసనమే  అవుతోంది...
నిన్ను చూడాలి
చూస్తూనే ఉండాలి...
అది నేనే కావాలి...
నేనే చూడాలి...
ఒంటరిగా ఉన్న నిన్ను
జాబిలి చూస్తేనే
తట్టుకోలేని నేను
మనిషినేనా...
నేను మనిషినే అయితే
నా స్వార్ధానికీ అర్ధం ఉంది...

No comments:

Post a Comment