Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 7 March 2015

నా కంటిపాప



నా కంటిపాప


కంటి తెరలపై నిత్యం నర్తించే
సుందర స్వప్నం నీవు...

కనురెప్పలలో ఇమిడిపోయే
చందమామవు నీవు...

కంటి నుండి జాలువారే
నులివెచ్చని సుడివి నీవు...

మనోతటాకంలో
సవ్వడి రేపే చిన్నారి అలవు నీవు...

గుండెలోతుల్లో వినిపించే
మూగ వీణవు నీవు...

ఎద కనుమల్లో విరిసిన
నవ వసంతం నీవు...

నా అణువణువులో నిండిన
అమృతగానం నీవు...

నాకనుల నీటి ధారలో
జారిపోకు నెచ్చెలీ...

నా కంటిపాపగా
చూసుకుంటాను నిన్ను...

No comments:

Post a Comment