Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 14 March 2015

మరలా వికసించిన స్వప్నం

మరలా వికసించిన స్వప్నం


కనురెప్పల పొత్తిళ్ళలో
పొదిగి పెట్టుకున్న
నా రంగుల స్వప్నం
చెమర్చిన నా కన్నీటి సుడులలో
కరిగిపోయి చెదిరిపోయి
చుక్కలు చుక్కలుగా
కిందికి జారుతుంటే
అంతా అయిపోయిందనే అనుకున్నా...
గుండె గుడిలో
వెలుగులు చిమ్మిన దీపం
కలతల సునామీలో
ఆరిపోయిందనే అనుకున్నా...
ఇక నిశి బాటలోనే
అంతిమ యాత్ర అనుకున్నా...
శ్వాసలో నుంచి బయటికి వచ్చిన ఊపిరి
మళ్ళీ లోపలికే రానంది
ఇక ప్రాణవాయువు
దక్కదనే అనుకున్నా...
ప్రాణం దేహాన్ని విడవక తప్పదనే అనుకున్నా...
అలా జరగలేదు
రాలిన కన్నీటి చుక్కలను
దోసిటపట్టి
గుండె గుడిలో దీపానికి
ఇంధనంగా అందించి
దేహంలో మళ్ళీ
ప్రాణం నింపింది
నా నేస్తం...

No comments:

Post a Comment