Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 26 March 2015

మనసు మరణించదు...



మనసు మరణించదు...
 
మరుస్తుందా మనసు
నిన్నటి చెలిమిని ...
వదిలేస్తుందా హృదయం
మరుపురాని బాసలను...
గడిచిన కాలం
అనుభూతులను
నింపుకున్న మనసు
మరణిస్తుందా...
గుండె గుడిలో గీతలు
రుధిరంలో తడిచిపోతాయా...
ఆ గీతలు ప్రేమ పుష్పాలుగా
వికసించి రావా...
రుధిరాన్నే ఇంధనంగా
మార్చుకుని
మనసు తోటలో
వసంతాన్ని పూయించవా...
విరిసిన కుసుమాలు
ముళ్ళ కంచెలను త్రెంచలేవా...
నిన్నటి చెలిమి వసంతమే
నిజమై ఉంటే
క్షణ భంగుర ఆవేశానికే
వాడిపోతుందా...
చెలిమిలో మనసు చెలమలు
ఎండిపోతాయా
నమ్ముతుందా మనసు
మనసు మరణించినదంటే...
మనసులో నిన్నటి మనసు
నిజమే అయితే
మనసు మరణించదు
మనస్వినీ...

No comments:

Post a Comment