Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 19 March 2015

ఫౌలాదీ దిల్

ఫౌలాదీ దిల్


అక్షరం పదును తేలుతోంది..
మనసు కనుమల్లో
ఫౌలాదీ గుండె మొగ్గ తొడుగుతోంది...
కుట్రలు కుతంత్రాల
జంజీర్ ను తెంచి వేయమంటోంది...
మనసుతోటలో
పూరెమ్మలను తోసిరాజని
ఇనుపముళ్ళు లేచి వస్తున్నాయి..
క్షణప్రాయ విజయంతో
మదాంధ దరహాసం చేస్తున్న
అసురమూకలను
చీల్చి చెండాడి
పదునుతేలిన అక్షరాలతో
రాక్షసగీతం
లిఖించేందుకు
ఉత్తుంగ తరంగంలా
ఉబికి వస్తోంది రుధిరం..
నిరాయుధం నాదేహం
వజ్రాయుధమే నా సంకల్పం ...
మనసు సంకల్పం
బండరాయే అయితే
నలు దిక్కులా పిక్కటిల్లే
కుక్కమూతి అరుపులు
ఫౌలాదీ సంకల్పాన్ని
తాకగలవా...
ఛేదించగలవా...
గాలిబుడగ విజయమే
పరాక్రమమని
భ్రమల్లో విర్రవీగే
అల్పప్రాణులకు
నా అంతిమ విజయమే

ఓ గుణపాఠం...

No comments:

Post a Comment