Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 8 March 2015

దొరలనీకు కనులనీరు



దొరలనీకు కనులనీరు

కనురెప్పలను చెమర్చనీయకు
కనులనీరు దొరలనీయకు...

గుండెగుడిలో దీపం ఆరనీయకు
మానస కడలిని ఎగసిపడనీయకు...

ఎగసిన కెరటాలను ఆగనీయకు
మౌన సంద్రాన్ని తట్టిలేపకు...

పరుగులు తీసే నదిని ఆగనీయకు
రాళ్ళు రప్పల మలుపుల్లో బెదిరిపోకు...

శ్వాసలో ఊపిరిని ఆరనీయకు
ప్రాణవాయువు లేదని కలత చెందకు...

జారిపడితే కన్నీటి చుక్కలు
కళ్ళలో గూడు కట్టుకున్న కలలు చెదిరిపోతాయి...

కలలు పలచనైతే
భావాలూ కరిగిపోతాయి...

భావమే లేకపోతే ముభావమే
మిగిలిపోతుంది...

నీ భావానికి భాష్యంగా
నీ కలలకు దర్పణంగా

నీ పలుకులకు అర్ధంగా
నువ్వంటేనే నేనుగా
మిగిలిపోవాలని ఉంది...

దొరలనీకు కనులనీరు
అందమైన కలగా జారనీకు నన్ను...

నీ కన్నీటి సుడులకు
నా కలతో
ఆనకట్ట వేస్తా...

No comments:

Post a Comment