Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 18 March 2015

పరిమళించేది మనమే

పరిమళించేది మనమే

సుందరం సుమధురం
మన ప్రణయబంధనం...
ఉరుములు మెరుపులకు
బెదరనిది చెక్కు చెదరనిది
మన అనురాగ బంధనం...
పుడమి తల్లిది మౌనమే
నీలినింగిదీ మౌనగీతమే
మధ్యలో వచ్చే
ఉరుములు మెరుస్తాయి
చల్లారిపోతాయి...
నింగి చెదరదు
ధరిత్రి పగిలిపోదు...
మన బంధమూ నింగి వంటిదే...
మన ప్రణయమూ
పుడమితో సమానం...
స్నేహమనే ముసుగులో
నమ్మించి దగా చేస్తారు...
మన అంతరాలను
కదిలిస్తారు...
అవాకులు చవాకులూ
పేలుతారు...
వీరంతా ఉరుములే
తుదకు చల్లారిపోయే వాళ్లే...
తాటాకు చప్పుళ్ళకు
మన ప్రేమ బెదురుతుందా...
కుళ్ళు కుతంత్రాలతో
అగ్గి రాజేయాలనుకునేవాళ్ళు
దహియించకమానరు...
నిత్యం పరిమళించేది
మన అనుబంధమే...

No comments:

Post a Comment