Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 12 March 2015

తరలిరావా వసంతమా



తరలిరావా వసంతమా

కలలు కనే పడుచు వయస్సు కాదు నాది...
కేరింతలు కొట్టే చిట్టి మనసు కాదు నాది...
తప్పటడుగులు వేసే బాల్యం కాదు నాది...
నా మస్తిష్కం నా మాట వినటం లేదు ...
నా మనసు నా అదుపులో లేనే లేదు..
నిశి చీకటిలో
కన్నులు మూస్తే చాలు...
ఆశ్చర్యం
నా కన్నులు నిన్నే చూస్తున్నాయి...
నా కనురెప్పల తెరలపై నువ్వే నర్తిస్తున్నావు...
నా చెంత నీవు లేవని తెలుసు
అయినా నా ముందే ఉన్నావు...
ఏదో మాట్లాడుతున్నావు...
నీ పలుకులు నన్ను చేరవనీ తెలుసు
అయినా నీ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి...
నవ్వుతున్న నీ ముత్యాలను
దోసిట పడుతున్నా నేను...
కవ్విస్తున్న నీ కన్నుల వెన్నెలలో
ఆడుకుంటున్నా నేను...
నీ ఎదలోని సొదలను
నా కలల వరదలో
ఒడిసి పట్టుకుంటున్నా నేను...
జీవన పయనంలో
జవాబులేని సవాళ్లలా
చుట్టుముడుతున్న
నీటి సుడులకు
ఎదురీదుతున్న నేను
నీ కలల వరదలో
నీ ఊహల పరవళ్ళలో
కొట్టుకు పోతూనే ఉన్నా ...
నన్ను దరి చేర్చి
సేద తీర్చేందుకు తరలిరావా
అందమైన వసంతమా... 

No comments:

Post a Comment