Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 16 March 2015

డిలిట్ ఆఫ్షన్ ఇవ్వు దేవుడా



డిలిట్ ఆఫ్షన్ ఇవ్వు దేవుడా

మనసుకు నచ్చని ఘడియలు
గుండె కోతను మిగిల్చిన క్షణాలు
జీవితంలో ఎన్నడూ మరువలేని సమయాలు...
ఇవన్నీ
చేరిపేసుకోగలిగితే...
డిలిట్ ఆప్షన్ జీవితంలోనూ
ఉండి ఉంటే
ఆలోచనే ఎంత బావుంది...
ఊహించుకుంటేనే
ఎంత రిలీఫ్ గా ఉంది...
దేవుడు మనిషి మస్తిష్కానికి
బాధాతప్త ఘడియలను
చేరిపెసుకునే
అవకాశమే ఇస్తే
ఆ రెండు రోజులను
నా జీవితంలో కనిపించకుండా
చేరిపెసుకునే వాడిని...
ప్రతిక్షణం భారమై
ఊపిరే నరకమై
భావనలు మెదడును
తొలిచివేస్తూ ఉంటే...
ఏం చేస్తున్నానో
తెలియని పరిస్థితి...
ఇలా ఎందుకు జరుగుతోందో
అర్థం కాని అయోమయం...
దేహాన్ని ఆత్మ  త్యజించిన చందానా
నాలోని ప్రతి ఒక్కటీ
నన్ను వదిలేసిన భావం...
కనురెప్పలను కాదని
కంటిపాప దూరమైందా...
గుండె గొంతుకలో ఊపిరి
అనంత వాయువుల్లో కలిసిపోయిందా...
తడబడిన నా అడుగులు
జాడలు కానరాక
పుడమిలో దిగబడిపోయాయా...
సంధ్యా సమయంలో కుంగిన జీవితానికి
ఇక ఉషోదయమే లేదా...
అందరిలాగే మాట్లాడుతున్నాను...
నడుస్తున్నాను...
నవ్వుతున్నాను...
కానీ నాలోనే నేను లేను...
చెమర్చిన నా కనురెప్పల
చుక్కలు బయటపడకుండా
కన్నుల్లోనే అదిమి పట్టుకున్నాను...
జీవన సమరంలో
పరులపై గెలుపు కాదు
నాతోనే నేను
ఓడిపోయానన్న ఆలోచన...
ఆ ఆలోచన
ఒక నమ్మకంగా మారి
అది గుండెను మెలిపడుతూ ఉంటే
ఎంత నరకం...
కనీసం ఊహించజాలను...
దేవుడా ఆ రెండు రోజులు
నాకు మాత్రం వద్దు...
డిలిట్ చెయ్యి దేవుడా
ఆ రెండు రోజులు
నా మస్తిష్కం నుంచి
తీసెయ్ దేవుడా...
నాకు ఆ జ్ఞాపకాలు
అస్సలు వద్దు దేవుడా...

No comments:

Post a Comment