Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 18 March 2015

ఎండమావిలో నీటి చుక్కను...


ఎండమావిలో నీటి చుక్కను...


నాలుగు దిక్కులలో
ప్రతి దిక్కూ నేనే...
నేలపై చూసినా
నీలి నింగిలో తిలకించినా
అన్నింటా నేనే...
పాటల పూదోటలో
అందమైన పల్లవిని నేనే...
వాడిన వసంతంలో
చిగురు తొడిగిన మారాకును నేనే
తప్పటడుగు నీవు వేస్తే
సరిచేసే
అడుగుజాడను నేనే...
జీవన సమరంలో
అలిసిపోతే
చేయూతనిచ్చే సమీరం నేనే...
కలత చెందిన మనసుకు
హాయినిచ్చే జోలపాటను నేనే...
గమ్యమే తెలియని
నిశి వీధులలో
నీ కంటికి కాగడాను నేనే...
నిత్యం విరబూయనీ నీవు
మమతల మతాబులు
ఎండమావుల్లోనూ
అమృతం పుట్టించి
నీ దాహార్తిని తీర్చేదీ నేనే... 

No comments:

Post a Comment