Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 10 April 2016

నాలోనే ఉన్నావు

నాలోనే ఉన్నావు

మరలా అదే అనుభవం
అదే వింతైన అనుభూతి
నువ్వు లేవని తెలుసు
పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది నాకు
నా చెవుల్లో ఏదో గుసగుసలాడుతున్నావు
ఏదో ముచ్చట చెబుతున్నావు
నువ్వులేకున్నా
నీ వెచ్చని శ్వాస తడుముతోంది నన్ను
నేను మాత్రమే ఉన్న గదిలో
నువ్వూ కలియతిరుగుతున్నావు
నీ మువ్వల సవ్వడి
నీ పరిమళం
నువ్వున్నావనే చెబుతున్నాయి నాకు
ఆరుబయట నవారు మంచంపై కూర్చుని ఉన్నా
అదే మామిడి చెట్టును చూస్తూనే ఉన్నా
ఏవో ఆలోచనల్లో మునిగితేలుతున్నా
అంతలోనే ఏదో అలికిడి
ఏమండీ చాయ్ కావాలా
మరింకేదైనా కావాలా
క్రీగంటి చూపుతో కవ్విస్తున్న
నువ్వే కనిపిస్తున్నావు
ఆవేశాలు రగిలినా
మాటల తూటాలు పేలినా
అనుమానాలు అవమానాలు మొగ్గతొడిగినా
అన్నీ గాలి బుడగలేనని తేల్చివేస్తూ
నీ రూపం నా ముందు మెదలుతూనే ఉంది
ఏ భావమూ లేకపోతే
ఏ బంధమూ విరియకపోతే
నువ్వు లేకున్నా
నా ఎదుట ఎలా ఉన్నావు
మనస్వినీ

No comments:

Post a Comment