Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 6 April 2016

చుక్కలా రాలనీ నన్ను

చుక్కలా రాలనీ నన్ను
 
ఒక చుక్కలా రాలనీ నన్ను
చినుకులా కురవనీ నన్ను
ప్రవాహమై సాగనీ నన్ను
ఉబికి వస్తున్న నన్ను బంధీని చెయ్యకు
కురిసే నన్ను ఆపాలని చూడకు
ప్రవహించే నాకు ఆనకట్టలు కట్టకు
సాగిపోనీ నన్ను
వీడిపోనీ నిన్ను
అదిమిపట్టకు నన్ను
జారవిడిచేయ్ నన్ను
నీలోనే జనియించిన నేను
నీ మనసుకు భారమే నేను
గుండెబరువునే నేను
జారిపోయిన స్వప్నానికి ఉనికినే నేను
స్వప్నం ఆనవాళ్ళను
తుడిచేసే తడినే నేను
రాలిపోనీ నన్ను
నీ కనులపొరల గూడును వదిలినా
నీ పాదాలను ముద్దాడే
కన్నీటి చుక్కనే నేను
మనసుతో సంవాదం చేసిన
ఓ కన్నీటి చుక్క
చెక్కిలి చెలమలను దాటి
నా పాదాలకు ప్రణమిల్లింది
మనస్వినీ

No comments:

Post a Comment