Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 17 April 2016

తుషారపు సంతకం

తుషారపు సంతకం

ఒక నుదుటిపై తుషారపు సంతకం నేను
ఒక చెక్కిలిపై చిలిపి రాతను నేను
ఒక పెదవిపై మెరిసే రేఖను నేను
ఒక కంటిలో వెలిగే కాంతి పుంజం నేను
ఒక కన్నీటి చుక్కలో లీలగా కనిపించే రూపమే నేను
కాలమనే యవనికపై చెరగని ముద్రను నేను
జ్ఞాపకాల దొంతరలో రాలిపడే ముత్యం నేను
ఒక గానమై ప్రవహించే జీవనంలో తారాడే పల్లవిని నేను
ఒక చిరునవ్వుగా
ఒక కన్నీటి చుక్కగా
ఒక జ్ఞాపకంగా
పాటలో పల్లవిగా
నా అడుగుల సవ్వడి నిత్యం వినిపిస్తూనే ఉంటుంది
మనస్వినీ

No comments:

Post a Comment