Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 15 April 2016

టెర్రరిస్టులు

టెర్రరిస్టులు

దూసుకు వచ్చిన తూటా
దేహాన్ని మట్టి కరిపిస్తుంది
గుండెల్లో కసిగా దిగబడిన కత్తి
ప్రాణాలను గాలిలోకి కలిపేస్తుంది
తూటా ముద్దాడినా
కరవాలం చెలరేగినా
ఆ కథ ముగిసిపోతుంది
హంతకుడికి హతుడికి
బంధం తెగిపోతుంది
నోటి నుంచి మాటల తూటాలు రాలితే
పెదాలమాటున విచ్చుకత్తులు నాట్యమాడితే
ఆ దేహం మరణించదు
గుండె ముక్కలవుతుంది
మనిషి సజీవమై నిలిచినా
ఆ మనసులో గాయం మండుతూనే ఉంటుంది
తుపాకి తూటాకు చికిత్స ఉంది
కత్తిపోటుకు మందు ఉంది
మనసుకు తగిలిన గాయానికి
ఈ విపణిలో లేపనం ఉందా
దేహం శ్వాస తీసుకున్నంత కాలం
ఊపిరిపోసుకునే మనసు
వికలమై విలపిస్తూనే ఉంటుంది
పరుగులు తీసే కాలంతో
మనసు గాయమూ భారంగా సాగుతూనే ఉంటుంది
చేతనైతే తుపాకితో కాల్చేయండి
వందసార్లు పొడిచిపారేయండి
మిత్రులారా
మనసుకు గాయం చేయకండి
మాటల తూటాల సమరమే
అసలైన తీవ్రవాదమని తెలుసుకోండి
తీవ్రవాదులుగా మిగిలిపోకండి

2 comments:


  1. మాటల సమరము చూడను
    తూటా వోలెన్ జిలేబి తూట్లను జేయున్ !
    నోటన పలుకుల మాధురి
    మీటగ మేలున్ గదోయి మీగడ వోలెన్ !

    ReplyDelete