Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, 5 April 2016

నువ్వే నువ్వే

నువ్వే నువ్వే 
 
ఎలా అనుకోను
ఎందుకు అనుకోను
నువ్వు నువ్వే కాదని అంటే
నీ ఉనికే లేదని వాదిస్తే
మనసెందుకు ఒప్పుకుంటుంది
తనలో రేగే సుడిగుండాలు
తనలో పూచే పూదోటలు
తనలో సవ్వడి చేసే సరాగాలు
కేవలం కల్పనలే అనుకుంటే
మనసుకు ఎందుకు నచ్చుతుంది
మనసులోని భావాలు మనసుకే తెలుసు
మనసు ఆలోచనలు మనసేగా రుచి చూసేది
అక్షరాలను కట్టడి చేయగలం
భావాలను బంధీ చేయగలం
ఘడియలను చెరిపేయగలం
అనుభవాలను కాదనగలం
అన్నీ కల్పనలే అని
అన్నీ రాతలేనని
అక్షరాల అల్లికలేనని
పదాల విన్యాసాలేనని
తేలికగా తేల్చేయగలం
ఊహాసుందరి నుంచి
మనస్వినిని చేరుకున్న పయనం
ఆగిపోయింది
మనస్విని మైలురాయిని చేరిన అన్వేషణ
అక్కడే ఆగిపోయింది
రాతలను ప్రశ్నించిన చందానా
మనసును బంధించగలమా
నవ చైతన్య కెరటమే
నా మనస్వినీ

No comments:

Post a Comment