Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 22 April 2016

విజయపుష్పం

విజయపుష్పం

సమస్యల వనంలో వికసించిన
విజయపుష్పం నీవు
చీకటి వెలుగుల జీవితంలో
నిశితెరలను చీల్చే కాంతి రేఖవు నీవు
ప్రతి పరీక్షా నీకు నిజంగా పరీక్షే
కలతలను
కన్నీళ్ళను
అనారోగ్యపు సమస్యలను
నిద్రలేమి రాత్రులను
అధిగమించిన నీవు
ఒక విజయతారగా నిలిచావు
గారాలపట్టి
అస్ఫియా సమ్రీన్
కాలేజి టాపర్ గా నిలిచిన వైనం
మనసును పులకింపజేస్తోంది
మనస్వినీ

1 comment: