Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 7 April 2016

స్వప్నం జారిపోయింది

స్వప్నం జారిపోయింది


చివుర్లు వేస్తుందని నమ్ముకున్న స్వప్నం
బీజంలోనే వాడిపోయింది
పుడమిపై జారిపడుతుందనుకున్న ఓ నీటి చుక్క
ఆవిరిగానే మాయమయ్యింది
మనసులో పుట్టిన చిన్ని ఆశ
ఆశగానే మిగిలిపోయింది
నమ్మకం నమ్మకాన్నే కోల్పోయిన క్షణం
గుండె పిండిగా మారిన ఘడియ
వెలుతురుకు నోచుకోని దీపం ఆరిపోయిన భావన
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
అస్తమయంలో కలిసిపోయిన వేదన
కన్నులలో మొలకలు వేసిన కల
కల్లగానే మిగిలిన రోదన
కన్నులు దాటని కన్నీరు
రెప్పలమాటున వెక్కి వెక్కి ఏడుస్తోంది
మనస్వినీ

No comments:

Post a Comment