Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 16 April 2016

తోటమాలి

తోటమాలి

పచ్చదనాల పూదోటలో
రతనాల గులాబీ

ఎర్రని మెరుపులు
లలితమైన సొగసులు
అందచందాల పూరాణి

చల్లని నీటి తిమ్మెరలు
మనసును తాకే సమీరాలు
అప్పుడప్పుడూ
ఉషోదయపు కిరణాల స్నానాలు

పూదోటకే మణిహారం
ఆ పువ్వుల రాణి
అందమైన జాబిల్లి

ఇంతలో ఏమయ్యిందో
సమీరం కరిగిపోయింది
నీటి తిమ్మెరలు ఆవిరైపోయాయి
వైభవం జారిపోయింది
తోట వాడిపోయింది

సడలని దీక్షను పొందిన పువ్వు
ఇప్పుడు మండే ఎండలను దిక్కరిస్తోంది

తన రెక్కలనే ఆయుధాలుగా మలుచుకుని
తిరుగుబాటు చేస్తోంది

ఒక మనసు కన్నీరు కారుస్తోంది
తన మనసు పువ్వు దుస్థితికి రోధిస్తోంది
ఆ మనసు తోటమాలిది
మనస్వినీ

No comments:

Post a Comment