Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 21 April 2016

శూలశోధన

శూలశోధన

శూల శోధనలెందుకు
మనసు మర్మము తెలియకనా ...
సాంగత్యమున తెలియని మర్మము
పరుల నోట పలుకునా...
కలిమిలోన ఒకమాట
లేమిలోన మరుమాట
స్నేహమంటే  వ్యాపారమా...
మనసులోన తెలియని నిజము
పరకంటిలోన కనిపించునా...
మనసు నమ్మిక సత్యమైన
అగాధములు ఇంక పెరుగునా...
పలుకులు చేయు గాయములకు
మమతలు లేపనం అద్దునా...
పరికించువాడు దేవుడైన క్షమింప
ఈ మనుషులెంత
మనస్వినీ

No comments:

Post a Comment