Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 6 April 2016

ఉన్నావా నువ్వు

ఉన్నావా నువ్వు

నీ గడపపై తల ఆన్చిన నేను
కన్నీళ్ళతోనే పలకరించాను
మౌనభాషతోనే కుశలమడిగాను
మనసులో సుడులు తిరిగిన వేదననే
నీ పాదాలకు పుష్పాలుగా అలంకరించాను
నా శ్వాసతోనే నీకు
వింజామరలు విసురుకున్నాను
నీ దరి చేరిన నేను
కొద్దిగా దూరం జరిగి మౌనంగా ఉండిపోయినా
నా మనసు మాత్రం నీతో మాట్లాడుతూనే ఉంది
నాలో రేగిన వేదనలను
రోదనలుగా చెబుతూనే ఉంది
సర్వంతర్యామివి నువ్వేనని
అన్నీ నీకే చెప్పుకున్నా
రత్న రాశులు కోరుకోలేదు
కీర్తి ప్రతిష్థలు అడగలేదు
కాసింత ప్రశాంతత ఇవ్వమని వేడుకున్నా
అందరి మనసులు తెలుసు నీకని అంటారు
నీకు తెలియకుండా ఏదీ జరగదని అంటారు
మరి నా మనసు గోస నీకు వినరాలేదా
విన్నా మౌనంగానే ఉండిపోయావా
నేడు నిన్ను తూలనాడుతున్న నేను
నాడు కన్నీటితో నీకు అభిషేకం చేయలేదా
నేను చేసిన నేరమేమి
నీ బాటలో నడవటమే పాపమా
మనసును మన్నించి
జీవితాన్ని వ్యాపారం చేసుకోలేదు నేను
అదే పెద్ద తప్పిదమా
ఎందుకు మౌనంగా ఉన్నావు
మసీదు గోడలలో బంధీవయ్యావా
శిలారూపంలో కదలలేకున్నావా
శిలువదిగి రాలేనని మిన్నకుండిపోయావా
ఏమీ చేయని నువ్వు
ఏమీ చేయలేని నువ్వు
ఆకారమే లేని నువ్వు
శిలగా మిగిలిన నువ్వు
అసలు నువ్వు నువ్వేనా
అదంతా ఒక కల్పనా
అసలు ఉన్నావా నువ్వు
దేవుడనే వాడుంటే ఈ మనుషులు
దయ్యలుగా ఎందుకు మారుతారు
మనస్వినీ

1 comment:

  1. Kuwait Nri's, is a kuwait based multilingual web portal which emphasizes on covering news from kuwait, India, Middle East, USA and all over the world. The site also keeps in view of all types of reader groups with different mindsets, age groups and also gender tastes and keep needs in mind and covers.. PLEASE VISIT www.kuwaitnris.com

    ReplyDelete