Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 6 June 2016

విధి ఆడిన వింత నాటకం

విధి ఆడిన వింత నాటకం 

చిత్రం భళా విచిత్రం
కనీవినీ ఎరుగని వైనం
ఎన్నడూ గానని అద్భుతం
నేను ఏమిటో నాకే తెలియదు
నా మనసు ఏమిటో నాకే తెలియదు
నా అంతరంగం నాకు తెలియనే తెలియదు
నేను ఎవరిని ప్రేమిస్తున్నా
ఎవరిని ధ్వేషిస్తున్నా
ఎవరంటే నాకు ఇష్టం
ఎవరంటే అయిష్టం
అసలు నాకు ఏం కావాలి
నేనేం కోరుతున్నా
ఎలా బతకాలని అనుకుంటున్నా
అసలు బతకాలని ఉందా నాకు
మరణం వైపు నడుస్తున్నానా నేను
ఆనందంగానే ఉన్నానా
మనసులోనే రోధిస్తున్నానా
ఏం చేయాలని అనుకుంటున్నా
నా అంతరంగం నాకే తెలియకున్నా
అందరికీ తెలిసిపోవటం
విధి ఆడిన వింత నాటకమే కదా
మనస్వినీ

No comments:

Post a Comment