Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 17 June 2016

తుంటరి గాలి అల్లర్లు

తుంటరి గాలి అల్లర్లు 

మబ్బులు సగం మింగేసినా
చేవ చావని చందమామమను చూడు
నిన్నెంత ఆకలిగా చూస్తున్నాడో
చల్లగా కురుస్తున్న వెన్నెలను చూడు
ఎంత దాహంగా నీ దేహాన్ని తడుముతోందో
చల్లని వెన్నెలలో స్నానం చేసినా
విరహంతో ఆవిర్లు వదులుతున్న నీ దేహానికి
వింజామరలు వీస్తున్న పిల్లగాలిని చూడు
ఎంత తమకంతో నిన్ను అల్లుకుంటోందో
పెదాలను ముద్దాడుతూ
మెడవంపుల జారుతూ
నాభీ మండలంపై సయ్యాటలు ఆడుతూ
చల్లదనాన్ని వీడి ఆవిరిగా మారిన
ఆ కొంటె వాయువులో ఉన్నది తీరని దాహమే
వెన్నెలను చేతులుగా చాచిన
నెలవంకలోని ఆరాటం దాహమే
ఒంటిని తడిమే పిల్లగాలిదీ
అంతులేని దాహమే
జాబిల్లిపై నాకు కోపం
పిల్లగాలిపై నాకు అలక
నీ కురుల సయ్యాటలాడే
మరుమల్లెలపై అసూయ
నిత్యం దాహార్తినైన నేను
నీ చెంత సాంత్వన కోసం అభిలషించే వేళ
చందమామకు ఎందుకు ఆరాటం
పిల్లగాలికి ఎందుకు ఉబలాటం
నువ్వూ నేనూ కలిసిన వేళ
ఈ వెన్నెల ఎందుకు
తుంటరి గాలి అల్లర్లు ఎందుకు
మనస్వినీ

No comments:

Post a Comment