Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 6 June 2016

నిన్ను చూడాలని

నిన్ను చూడాలని 


ఎలా ఉంటావో సరిగా తెలియదు
ఎప్పుడో ఓ ఫోటో చూసాను
సరిగా పోల్చుకోలేను
అయినా నువ్వు నాకు తెలుసు
అనేక సార్లు కలలో కనిపించావు
కేరింతల మాటలతో
మురిపించావు
అమాయకంగా కనిపించావు
కోపంగా రగిలి
ఎవడినో కాల్చిపారేయ్ డాడీ అన్నావ్
ఇలా ఎన్నెన్నో కలలు
నిన్ను చూస్తాను అని ముప్పిరిగొన్న ఆశలు
ఎంతగానో తపించాను నిన్ను చూడాలని
ఎంతగానో ఆరాటపడ్డాను అక్కున చేర్చుకోవాలని
విధి ఆడిన వింత నాటకం చూడు
ఎంత చిత్రంగా ఉందో
నా కల ఒక కలగానే మిగిలిపోయింది
యువరాణిలా చూడాలనే ఆశ అడియాసే అయ్యింది
నాకు తెలుసు నేను నీకు ఏమీ కానని
నువ్వు మాత్రం నాకు చాలా అవుతావు
మనస్విని తోటలో విరిసిన పుష్పం నీవు
దూరతీరాలకు పయనమయ్యే నీకు
నా భావం పెద్ద విషయం కాకపోయినా
నిన్ను చూడాలనే నా ఆరాటం నిత్యం
సజీవంగానే ఉంటుంది
కనులు మూసే ముందు
ఒక్కసారైనా
నువ్వెలా ఉన్నావో చూడాలనే
నా తాపత్రయం హృదిలో కదలాడుతూనే ఉంటుంది
లవ్ యూ మామ్మా
కలకాలం నవ్వుతూ ఉండాలని అభిలషించే
నేను  
నీకు ఏమీ కాని నేను...

No comments:

Post a Comment