Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 19 June 2016

థాంక్యూ కిడ్స్

థాంక్యూ కిడ్స్


తెలియకుండానే కనురెప్పల మాటున
తడి చేరింది
మనసులో తడిచిన భావమేదో
కంటి తెరలపై కదలాడింది...
నాన్న మనసును చదివే సంతానం దొరికితే
ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది
నిజంగా ఆ అదృష్టం నాకు దక్కడం
అర్థంచేసుకునే పిల్లలు దొరకడం
గర్వంతో పొంగిపోతోంది హృదయం...
అప్పుడప్పుడూ అనిపిస్తుంది నాకు
నేను మంచి నాన్ననేనా అని
నాకైతే తెలియదు కానీ
నాకు మంచి పిల్లలే దొరికారు...
కలిమిలోనూ
లేమిలోనూ
నా మనసు తెలిసి
మనసుకు అనుగుణంగా నడిచి
నాకోసమే జీవించే
నా ఇద్దరు పిల్లలు
నిజంగా నాకు వరప్రసాదాలే...
ఆనందం ఫరిడవిల్లిన తరుణాన
కంటనీరు ఒలికిన ఘడియలోనా
మా నాన్న చేసిందే నిజం
మా నాన్న బాటే సత్యమని  
నమ్ముతూ
నాకు వెన్నంటి కాదు
నాకు ముందు నడిచే
ఆ రెండు పువ్వులు
నా జీవితానికే వెలుగుదీపికలు...  
మౌనమైన నేను
వికలమైన నేను
నాలోనేను కుమిలిపోతూ ఉంటే
నా మనసును తెలిసిన గారాలపట్టి
పెద్దరికం తెచ్చుకుని
నన్ను ఓదార్చే వేళ
అది నాకు తల్లి వంటిదే...
ఆనందంలో జతగూడి
నాతో కేరింతలు వేసే ప్రిన్స్
మా ఇంటి యువరాజు
నా వేదనను తన వేదనగా మలుచుకుని
తనలో తాను కుమిలే పరిపక్వత
నాకు తెలియదా...
అన్నీ బాగుండి
సిరులు విరులుగా కురిసినప్పుడు
అనురాగాలు
ఎండమావులు పలకరించిన వేళ
ఈసడింపులు
ఇలాంటి సంతానం ఎందరినో చూసిన నేను
నా ఇంట కలిమిలేముల్లో
మారని మమకారం చూసి
పులకించిపోనా...
ఇలలో నేనున్నా
కలగా మిగిలిపోయినా
నా దీపాలు
కలకాలం వెలుగుతూ ఉండాలని
నా మనసు భగవంతుడిని
ప్రాదేయపడుతోంది...
తెలవారగానే ఫాదర్స్ డే విషెస్ చెప్పి
మనసును కదిలించిన
పువ్వులకు
థాంక్యూ కిడ్స్ అని చెప్పకుండా ఉండగలమా
మనస్వినీ...

No comments:

Post a Comment