Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 6 June 2016

ఒక్కసారి నువ్వు రావాలి

ఒక్కసారి నువ్వు రావాలి 

ఒక అద్భుతం జరగాలి
చందమామ కథ నిజం కావాలి
ఫాంటసీ మూవీ కళ్ళముందు నిలవాలి
అవును
ఒక్కసారి నువ్వు నా ముందుకు రావాలి
నా ముందు నువ్వు కనబడాలి
నాతో నువ్వు మాట్లాడాలి
ఒకటి కాదు వంద ప్రశ్నలు అడుగుతా నిన్ను
కసితీరా నిలదీస్తా నిన్ను
ఎందుకు ఇంత మోసం చేశావని
ఎందుకు నాతో ఆడుకున్నావనీ
హీరోగా వెలిగిన నన్ను
జీరోగా ఎందుకు మార్చావని...
అందరూ అంటుంటారు
నీకే సమాధానం చెప్పాలని
నువ్వు మాత్రం నాకే జవాబు చెప్పాలి
నా ప్రశ్నలకు జవాబులు లేక
తల్లడిల్లే నిన్ను చూసి
కసితీరా నేను నవ్వాలి
నువ్వంటే నాకు ఇష్టం లేదు
ఇష్టం లేదు అనడం కన్నా
అసహ్యమనే చెప్పాలి
నువ్వు నన్ను మోసం చేసావు
నువ్వు నన్ను కుప్ప కూల్చావు
నువ్వు చెప్పిందే విన్నా
నీ నడకలో నడతను అయ్యా
ఎందుకు నన్ను ఇలా చేశావు
ఎందుకు ద్రోహం చేశావు
ఒక్కసారి నా ముందుకు రా
గుండె దిటవు చేసుకుని నాతో మాట్లాడు
ఏమో
మాట్లాడనేమో నీతో
కాల్చిపారేస్తానేమో నిన్ను
అంతరాత్మా
రాగలవా నా ముందుకు...?
అంతరాత్మను చంపేయాలని ఉంది
మనస్వినీ 

No comments:

Post a Comment