Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 9 June 2016

మనసులోనే భావాలు

మనసులోనే భావాలు 

చాలా రాయాలని ఉంది
ఏదేదో రాసేయాలని ఉంది
మనసుపోరలో భావాలు
ఉబికివస్తున్నాయి
ఎగసిపడుతున్న భావాలకు
అక్షరాలు కనులముందు
కదలాడుతున్నాయి
భావాలకు రూపమివ్వాలనీ
మనసును తేలికపరిచే
లేపనంగా మారాలని
అక్షరాలు ఉబలాటపడుతున్నాయి
మనసులో మేముండలేము
మాకు విముక్తి కల్పించమని
ప్రాధేయపడుతున్నాయి
అయినా
ఎందుకో ఏమో
మనసు ఒప్పటంలేదు
మనసు కవాటాలు తెరుచుకోవటం లేదు
అక్షరాలకు ప్రాణం పోయలేకపోతున్నా
ఏమయ్యిందో ఏమో గాని
మనసు భావాలను
మనసులోనే దాచుకుంటున్నా
మనస్వినీ

No comments:

Post a Comment