తొలిసంగమం...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం...
ఆరోజే ఉదయించినట్లు...
ఏనాటి నుంచో అలుముకున్న
చీకటి తెరలకు
ఆరోజే తొలిపొద్దు పొడిచినట్లు ...
అవును అదే నాకు తొలి ఉదయం..
అప్పుడే నిజమై పులకించింది నా హృదయం...
నిత్యం నాలో మెదిలిన ఆ రూపం
అప్పుడే నిజమైన మధుర సమయం...
విరిసిన వయస్సు ద్వారం తెరిచిన క్షణం ...
ఉబికిన వలపు బుసకొట్టిన వైనం ...
ఎంత మధురం అది మన తొలి సంగమ సమయం...
చీకటమ్మ చెంత లేకున్నా
వెన్నెలమ్మ పరదాలు వేయకున్నా
అసౌఖ్యంలోనే సౌఖ్యాన్ని వెతుక్కుంటూ
మన తనువులు జతకలిసిన వైనం...
వాలిన కనురెప్పలే చీకటిగా
విరిసిన గులాబీ పెదాల మెరుపులే
వెన్నెలమ్మ వెలుగులుగా
రగులుతున్న దేహాలనుంచి
స్రవించిన స్వేదమే మంచి గంధంలా
ఏకమయ్యాం మనం...
అప్పుడే అనిపించింది నాకు
నా కలల ఊహాసుందరి
నీవేననీ
మనస్వినీ...
No comments:
Post a Comment