ఎక్ ఠహనీ
పే చాంద్ టికా థా
మై యే
సమ్జా తుమ్ బైఠీ హో ...
అవును జగ్జీత్ స్వరం నుంచి
జాలువారిన
చందమామవి నీవే...
గుల్జార్
కలం నుంచి
రాలిపడిన
వెన్నెలమ్మవి నీవే...
జఫర్ మనసు
ఒలికించిన
భావుకతవి
నీవె...
ఛుప్కే ఛుప్కే
అంటూ
గులాం ఆలీ
గళం పలికిన
మధురసం
నీవే...
బహారో ఫూల్
బర్సావో
మేరా
మహబూబ్ ఆయా హై
అని
మత్తుగా పలికిన
రఫీ
కంఠస్వర రాగమాలికవి నీవే...
ఏమని
వర్ణించను నిన్ను
కవిరాజు
మనస్సువి నీవే...
నిజంగా
నీవు నీవే...
మబ్బుల
చాటు చందమామవి నీవే...
పుడమిని
పులకింపజేసే
వెన్నెల వర్షం
నీవే...
నా పాటకు
పల్లవివి
నీవే...
నా భాషకు
భావం నీవే...
నా రాతకు
అక్షరం నీవే...
నా
అక్షరానికి అర్ధం నీవే...
అన్నీ
నీవే..
సర్వమూ
నీవే...
మాటలు
ఎన్నయినా చెప్పొచ్చు
ఇది నిజమే
నువ్వు లేనిదే
నాకు భావమే
లేదు
మనస్వినీ...
No comments:
Post a Comment