Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 4 February 2015

నీవే మనస్వినీ...



నీవే మనస్వినీ...


నిన్నే చూస్తున్నా ...
నీ అనుభూతికే లోనవుతున్నా...
ఏటో చూస్తూ ఉన్నా
అని నువ్వనుకున్నా
ఎక్కడో ఉండిపోయానని
అనుకుంటున్నా
నేను నిన్నే చూస్తున్నా...
నువ్వనుకునేది నిజం కాదు...
నిజమేమో తెలుసుకోలేవు...
నా కనులతో కాదు
తనువులోని ప్రతి అణువుతో
నిన్ను చూస్తూనే ఉన్నా...
నీతో మాట్లాడుతూనే ఉన్నా...
నా పెదాలు నిన్ను
పలకరించకపోవచ్చు...
మనసు పొరల్లోకి తొంగి చూడు...
మౌనమైన నా భాష
ఎన్నెన్ని భాష్యాలు చెబుతుందో...
రుద్రమైన నా నయనాలు చూడు...
ఎన్ని ఊసులు చెబుతాయో...
జారి పడుతున్న
కన్నీటి చుక్కను అడుగు
ఎన్ని బాసలు పలుకుతుందో...
శ్వాస తీసుకుంటున్న ఊపిరిలో
ఒక్కసారి తొంగి చూడు
మన అనుభవాలు
ఎన్ని కనిపిస్తాయో...
మళ్ళీ మళ్ళీ చెబుతున్నా
నా భావం నా భాష్యం
నా నయనం
నీవే
మనస్వినీ...

No comments:

Post a Comment