Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 19 February 2015

అమ్మవు నీవు...



అమ్మవు నీవు...


నా కడుపులో పేగుల
ఆకలి కేకలు నీకే తెలుసు...

నా కన్నుల్లో కన్నీరుకు
అర్ధం నీకే తెలుసు ...

జాలువారిన కన్నీటిని
దోసిట పట్టేది నువ్వేనని తెలుసు...

నా కన్నులు చెమర్చితే
నీ కంటనీరు రాలుతుందనీ తెలుసు...

నా మనసులో భావాలకు
భాష్యం నీకే తెలుసు...

భావం ముభావమైతే
అసలైన భావం నీవేనని తెలుసు...

నా మనసు మూగబోతే
నీ మనసు మాట్లాడుతుందని తెలుసు...

నా ఆనందాలూ
నా ఆవేదనలూ
అన్నీ నీకే తెలుసు...

నీవు నాకు చెలియవు మాత్రమే కాదు
అమ్మవే నీవని
నాకు బాగా తెలుసు
మనస్వినీ...

No comments:

Post a Comment