చచ్చిపోవాలని ఉంది...
చచ్చి పోవాలని...
ఈ లోకం వీడిపోవాలని...
నన్ను నేను దహించుకోవాలని...
అన్నీ వీడి మరణించాలని...
ఎన్నో సార్లు అనుకున్నా
అన్ని సార్లూ వాయిదా వేసుకున్నా...
క్యాలెండర్ లో తేదీలు మారినట్లు
నిర్ణయాన్ని మార్చుకున్నా...
బతకాలని లేకున్నా బతికే ఉన్నా...
మనసైన మనసులో
స్థానం కోల్పోయి
తుది అంకంలో
ప్రేమ రహితమై
ఇష్ట సఖి మదిలో
ప్రతినాయకుడినై
నా మనసులో విషాదం
నింపుకుని
పరాజితుడిగా
నిష్క్రమించలేక
బతికిపోయాను...
ఇప్పుడు మళ్ళీ
చచ్చిపోవాలని ఉంది...
ఆ మనసులో మనసుగా
నిండిపోయాను...
వికలమైన నా మనసుకు
ఇప్పుడు ఆ మనసే ఓదార్పు...
భారమైన నా భావనలకు
ఇప్పుడు ఆ మనసే ఒక భావం...
మనసంతా నేనే...
మనసులో ఒక అందమైన భావంగా
మిగిలిన నేను
ఇప్పుడు విజేతను...
నీ మనసు గుడిలో
దేవుడిగా కొలువైన నేను
ఇప్పుడు దేవుడి దగ్గరకి
చేరేందుకు సిద్ధం...
నీ మనసులో
చిరస్మరణీయ కావ్యంలా
మిగిలిపోయేందుకు
వందసార్లయినా
చచ్చిపోతాను
మనస్వినీ...
No comments:
Post a Comment