Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday, 13 February 2015

నింగికి నేలనవుతా...



నింగికి నేలనవుతా...

అమ్మలోని అమృతమై
నేను వర్షిస్తా ...
నాన్నలోని బాధ్యతనై
అండగా నిలుస్తా...
అన్నలోని ఆప్యాయత నేనై
అండగా నిలుస్తా...                                     
సోదరి అనురాగమై
తోడుగా ఉంటా...
భాగస్వామిని నేనై
అడుగుజాడను అవుతా...
కన్నీరే జారితే
స్నేహమై చేయూతనిస్తా...
ఆనందాలే వెల్లివిరిస్తే
విరిసిన పువ్వును నేనవుతా...
బాధలే నీకు వస్తే
జారిపడే కన్నీటి చుక్కనవుతా...
సునామీలే ఎదురు వస్తే
అడ్డుకునే అగ్నిపర్వతం నేనవుతా...
నీవు నడిచే దారిలో
మనసు బాటను నేనే అవుతా
మనస్వినీ...

No comments:

Post a Comment