రక్తాక్షరాలు...
గుండె పలక మీద రాసుకున్న
అక్షరాలు...
అవి శిలాక్షరాలు కాదు
రక్తాక్షరాలు ...
కడలి కెరటాలకు
రాళ్ళమీద గీతలు మాసిపోవచ్చు ...
ఇసుకలో రాసుకున్న అక్షరాలు
చిన్న చిన్న అలలకే చెదిరిపోవచ్చు...
నా మనోఫలకంపై
ముద్రవేసిన బాసలు
చెదిరిపోవు...
చెప్పుకున్న ఊసులు
మాసిపోవు...
నా రుధిరంలో కదలాడే
కోట్ల కణాలు
గుండె పలకపై
అక్షరాలకు నిత్యం ప్రాణం
పోస్తూనే ఉంటాయి...
ఒక్కసారి నేను బాస చేస్తే
నా రక్తమే దానిని సజీవంగా
ఉంచుతుంది..
నా రక్తంలో కణాలు
సజీవంగా ఉన్నంతకాలం
నా బాసలూ
సజీవంగానే ఉంటాయి
మనస్వినీ...
No comments:
Post a Comment