అమ్మకానికి జీవితం ...
జీవన గమనంలో
అడుగుజాడలు
విడుస్తూ
ముందుకు
నడుస్తున్నా
పాము
కుబుసం విడిచి వెళ్ళినట్లుగా...
వెళుతూనే
ఉన్నా
ఎక్కడా
ఆగకుండా
ఈ జగతిని
గమనిస్తూ...
అదేంటో ఈ
లోకం
ఇక్కడ అంతా
అమ్మకమే...
ప్రతిదీ
అమ్ముకుంటున్నారు...
అంతా
వ్యాపారమే...
ఒకరు మనసు
అమ్ముకుంటే...
మరొకరు
తనువు అమ్ముకుంటున్నారు...
సిరి
సంపదలకోసం ఒకరు
స్నేహాన్ని
అమ్ముకుంటే
మరొకరు
బంధుత్వాన్నే
పణంగా పెడుతున్నారు...
దేన్నీ
వదలటం లేదు...
భూమినీ
అదే భూమి
ప్రసాదించిన నీటినీ,
చివరకు
బుడగల్లో నింపి
గాలినీ
అమ్ముకుంటున్నారు
ఆకాశం
మాదంటే మాదనీ
వంతులు
వేసుకుంటున్నారు...
ఒక్కసారి
ఆలోచించు
మిగిలింది
నువ్వూ
నేనే...
ఈ అమ్మకాల
సంత లోకంలో
అమ్మకానికి
బలికాకుండా
మిగిలిపోయేందుకు
శిలలుగా
మారిపోదామా...
ఎందుకంటే
శిలలను
దేవుడిగా పూజిస్తుంది
ఈ లోకం
మనస్వినీ...
No comments:
Post a Comment