మేరా నామ్ జోకర్ ...
అవును అప్పుడు నేను కింగ్ ...
నన్ను పలకరించేందుకు
నా పలకరింపు కొరకు
వేచి ఉంది సమాజం...
నేను ఏంచేసినా
సంచలనం...
నా అక్షరం ఒక అగ్నికణం...
అవినీతికి అది బాణం...
బాధితులకు అభయహస్తం...
నాతో మాట్లాడాలనీ
నిమిషాలు కాదు
గంటలు గడిచినా
అందరికి అది
ఇష్టమైన నిరీక్షణ...
నేనెక్కడికి కదిలినా
నాతో మరో పది మంది...
రాజు వెడలె రవి తేజములన్నట్లు...
కాలం మారింది...
ఇప్పుడు నేను ఒంటరి...
చుట్టూ అందరూ ఉన్నా
నాతో ఎవరూ లేరు...
ఇప్పుడు నేనేది చేయబోయినా
నవ్వులపాలే...
కింగ్ జోకర్ గా
రూపాంతరం చెందిన
పరిణామం...
నాడు నాకోసం వేచి ఉన్న వారే
మొహం చాటేసే సమయం ...
నాడు సలాం చేసిన
సమాజం నేడు నవ్వుతోంది...
నాడూ నేనే
నేడూ నేనే...
నేను జోకర్ ని ఎలా అయ్యాను
ఇది నా స్వయంకృతాపరాధం కాక
ఇంకేమిటి
మనస్వినీ...
No comments:
Post a Comment