నేనంటే నేనే...
అదే నేను ...
అదే మనసు ...
అదే భాష...
అదే భావం ...
అదే భాష్యం
...
అవే
రాతలు...
అవే
మతలబులు...
నేను
మారలేదు...
నా మనసు
మారలేదు..
నా భాష
మారలేదు...
నా భావం
మారలేదు...
నా భాష్యం
మారలేదు...
నా రాత
మారలేదు...
కాలం
అగ్నిపరీక్ష పెట్టినా...
నా
భావానికి
ఎన్ని
అర్థాలు వెతికినా...
ఎన్ని
లోపాలు
శోధించినా...
నాడూ నేనే ...
నేడూ
నేనే...
భావమూ
నేనే...
భాష్యమూ
నేనే...
నాడు
ప్రియమైన నాభావం
నేడు
అప్రియమైపోతుందా ...
నాడు పనికి
వచ్చిన నా భాష్యం
నేడు
పనికిరాకపోతుందా...
నేను
నేనేనని
నీకు
మాత్రం తెలియనిదా
మనస్వినీ...
No comments:
Post a Comment