దేహాన్ని
వీడుతున్న ప్రాణం...
దేహాన్ని
వీడి ప్రాణం వెళ్లిపోతుంటే
చూశార
ఎవరైనా?
నేను
చూసాను...
నా ప్రాణం
నా దేహాన్ని వీడిపోతుంటే
జరిగిన
జరుగుతున్న
పరిణామాలను
చూస్తూ
నిలబడిపోయా
నా ప్రాణం
అన్నీ సర్దుకుంటుంటే
ఒక్కొక్కటిగా
సర్దుకుంటూ
తీపి చేదు
జ్ఞాపకాలను
మూట గట్టుకుంటూ
అన్ని
సర్దుకుంటున్నా
ఏమీ చేయలేక
నిలిచున్నా
అవును
నన్ను వీడిపోతుంది
నా
ప్రాణం...
పరిమితుల
మధ్య నలిగిన నేను
మరో
ప్రపంచం వైపు నా ప్రాణం
తరిలివెళుతున్నా
ఏమీ
చేయలేని నిస్సహాయత నాది
అందరూ
ఉన్నా ఎవరూ లేని
సమాజంలో
నన్ను ఒంటరిని చేసి
వెళ్ళిపోతున్నావా
మనస్విని...
No comments:
Post a Comment