Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 3 February 2015

నా మరణం...



నా మరణం...

మరణం ఒక అలౌకికం ...
ఏ దశలోనూ
ఏ దిశలోనూ
లభించని ఆనందం...
సూర్యుడిని నల్లగా మార్చేదీ
వెన్నెలను మాయం చేసేదీ
సర్వ ప్రకృతిలో
జీవాన్ని కలిపేదీ
మరణం కాక ఇంకేమిటి...
జీవనపోరాట గమనాలనూ
కష్టాలనూ
కన్నీళ్ళనూ
మాయం చేసి
పెదవిపై చెదరని
చిరునవ్వును అద్దేది చావే కదా...
ఇదే నిజమయితే
నేను రోజూ చస్తున్నాను...
కాదు కాదు చంపబడుతున్నాను...
కురులు విరబోసిన చెలియ
తన మోముని నా మోముపై వాల్చగా
ఆ నల్లని కురుల పరదాలలో
జగతి సూరీడు పారిపోలేదా...
తన మెత్తని కరస్పర్శతో
నా కురులను సవరిస్తూ
ఒడిలోకి జార్చుకుంటే
నా పెదాలపై
చెదరని చిరునవ్వు విరబూయలేదా...
తనువుల తపనలో
అలుపెరుగని పోరులో
తనను ఓడిస్తూ
నేను ఓటమి అంచులోకి
దిగబడుతుంటే
అది అలౌకికం కాక ఇంకేమిటి...
మరణంలోని
దివ్యత్వం
నాకు నీలోనే కలిగితే
ఈ మరణమే నాకు
ఎంతో మధురం
మనస్వినీ...

No comments:

Post a Comment