విధ్వంసకల...
ఆకాశం బద్దలవుతోందా...
సూరీడు ముక్కలుగా
రాలిపోతున్నాడా...
చందమామ మైనం ముద్దలా
కరిగిపోతున్నాడా...
తారకలన్నీ టపాకాయల్లా
పేలిపోతున్నాయా...
సముద్రుడు ఆగ్రహించి
పుడమిని ఆక్రమించుకున్నాడా...
ఏదో రసాయనం చల్లినట్లు
పచ్చని ప్రకృతి సమస్తం
మాడి మసైపోయిందా...
చల్ల గాలులూ
పిల్లగాలులో మాయమయ్యి
వేడి సెగలు ఎగసిపడుతున్నాయా...
ఏం జరుగుతోంది...
సర్వ జగత్తు నాశనమయినట్లు
నా పాదాల కింద నేల
జారిపోయినట్లు
నా కన్నుల వెలుగులు
చీకట్లో కలిసిపోయినట్లు
నా శ్వాసలో
ఊపిరే ఆగిపోయినట్లు
నా ప్రాణం నన్ను
వదిలేసి వెళ్లిపోయినట్లు
ఏమిటిది...?
నాలో ఎందుకు జనియించింది
ఈ విధ్వంసస్వప్నం
మనస్వినీ...
No comments:
Post a Comment