పువ్వుకు
తెలియదా ముళ్ళున్నాయనీ...
రాళ్ళూ
రప్పలున్నాయని
నదీ
ప్రవాహం ఆగుతుందా ...
బండరాళ్ళు
గులకరాళ్ళపై
నది
అలుగుతుందా ...
పడి లేచిన
కెరటం
గమ్యాన్ని
మార్చుకుంటుందా...
శిలలపై
కెరటం అలుగుతుందా...
మచ్చలున్నాయనీ
తారకలు
చంద్రమను
వీడి పోతాయా...
చల్లని కాంతిని
విసిరికొడతాయా...
మారాం
చేసిన బిడ్డను
తల్లి ఛీకొడుతుందా...
అమ్మ మనసు
బిడ్డను
త్యాగం చేస్తుందా...
ముళ్ళు
ఉన్నాయని గులాబీ
సౌరభాల్ని
వీడుతుందా...
ముళ్ళున్న
తావిని
పువ్వు వదిలేసి పోతుందా ...
మొగ్గగా
విచ్చుకున్నప్పుడే
పువ్వుకు
తెలియదా
తావిలో ముళ్ళున్నాయనీ
మనస్వినీ...
No comments:
Post a Comment