Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 14 February 2015

నిత్య ప్రేమికుడిని...



నిత్య ప్రేమికుడిని...


మొదటి సారి కనులు కలుసుకున్న
ఘడియ గురుతు లేదు నాకు...
ఆ ఘడియలో పులకరింత మాత్రం
ఇంకా మెదులుతూనే ఉంది నాలో...
మనసూ మనసూ మాటలాడుకున్న
క్షణాలను ఎప్పుడో మరిచిపోయాను నేను
ఆ మాటల మతలబులు ఎప్పటికీ
కొత్త పుంతలు తోక్కుతూనే ఉంటాయి నాలో...
మొదటి కలయిక ఎప్పుడో జ్ఞాపకం లేదు నాకు
ఆ సంగమ వేళ కురిసిన అమృతధారలు
ఇప్పటికీ తీపిని పంచుతున్నాయి నాకు...
ఘడియ గురుతు లేదు...
క్షణాలు మరిచిపోయాను...
తేదీలు అస్సలు గురుతుకు రావు...
అయితేనేమి ఏదీ మరిచిపోలేదు నేను...
ప్రేమించటం మానలేదు నేను...
వేళ పాళలు
తేదీలు
ఘడియలు
ప్రేమకు కొలమానాలు
ఇవేవీ లేకుండా ప్రేమిస్తూనే ఉంటాను నేను...
ప్రేమకు ఒక దినమెందుకు...?
నేను
నిత్య ప్రేమికుడిని
మనస్వినీ...

No comments:

Post a Comment