కన్నుల్లో కైపులు...
పువ్వును
తాకితేనే
కందిపోయే
అరచేతులు ...
మఖమల్
వస్త్రంలా
మెత్తని
కరములు ...
ఆ నునుపైన
చేతులపై
పూలతీగల్లా
మెహందీ
సోయగాలు...
పండిన
గోరింట అందాలు
ఆ అందాలను
మెరిపించిన
వైనాలు...
ఎంతో
తన్మయంతో
నీవు
అరచేతులను
నా వైపు
చాచితే
తమకంతో
నేను
నీ చేతులను
ముద్దాడితే...
చేతులపై
పండిన గోరింట
బుగ్గలపై
ఎలా చేరిందో...
చేతుల్లో
ఎరుపు
బుగ్గలపై
కెంపుగా ఎందుకు మారిందో...
బుగ్గల
కెంపు
కన్నుల్లో
కైపు
ఎందుకీ
మార్పులు...
ఆ వేళ నీ
మనసులో
ఎన్నెన్ని
సరాగాలో
మనస్వినీ...
No comments:
Post a Comment